తమిళ హిట్ సినిమాపై రామ్ కన్ను !

తమిళ హిట్ సినిమాపై రామ్ కన్ను !

కొన్నిరోజుల క్రితమే విడుదలైన తమిళ సినిమా 'తడం'.  అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  మన తెలుగు హీరో రామ్ కూడా ఆ సినిమా పట్ల బాగా ఇంప్రెస్ అయ్యాడు.  చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయలని డిసైడ్ అయ్యాడు.  దీంతో నిర్మాత స్రవంతి రవికిశోర్ చిత్ర రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేశారు.  ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తవగానే ఈ సినిమా మొదలుకానుంది.  తమిళంలో మగిస్హ్ తిరుమేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ఏ దర్శకుడు డీల్ చేస్తాడో ఇంకా డిసైడ్ కాలేదు.