మంత్రి కేటీఆర్‌ను కలిసిన హీరో రామ్‌..

మంత్రి కేటీఆర్‌ను కలిసిన హీరో రామ్‌..

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపుకు చాలా మంది స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు... పారిశ్రామికవేత్తలు, సినీ తారలు  విరాళం ప్రకటిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా వరద భాదితుల సహాయార్థం యువ కథానాయకుడు రామ్ పోతినేని తన వంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని మంత్రి కేటీఆర్ కార్యాలయానికి స్వయంగా వెళ్లిన రామ్..రూ.25 లక్షల చెక్ ను కేటీఆర్ కు అందజేశారు.  ఆయ‌న మంచి మ‌న‌సుపై నెటిజ‌న్స్ ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం అత్యధికంగా 15 కోట్లు ప్రకటించగా, తమిళనాడు 10 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ 2 కోట్లు విరాళం ప్రకటించాయి.