రానా ఇంట పెళ్లి సందడి షురూ ...
దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి షురూ అయింది. హీరో రానా దగ్గుబాటి మరి కొద్ది గంటలలో మిహికాతో ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, వేడుకకి కేవలం 30 మంది మాత్రమే హాజరు అవుతారని తెలుస్తుంది. రామానాయుడు స్టూడియోలో బయో సెక్యూర్ వాతావరణంలో పెళ్లి వేడుకని నిర్వహించనున్నారు. తాజాగా రానా తన తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..రెడీ అని కామెంట్ పెట్టారు. ఒకే ఫ్రేంలో ముగ్గురుని చూసిన ఫ్యాన్స్‌కి ఆనందం అవధులు దాటింది. పెళ్లి వేడుకలో ఎవరెవరు సందడి చేస్తారు... చైతూ, సమంతలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారా ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల మదులలో వస్తున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)