హీరో సందీప్ కిషన్ కు గాయాలు

హీరో సందీప్ కిషన్ కు గాయాలు

యువ హీరో సందీప్ కిషన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలులో షూటింగ్ జరుపుకొంటొంది. బళ్లారి చౌరస్తా వద్ద బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో సందీప్‌ గాయపడ్డారు. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర బృందం తెలిపింది.