క్యాన్సర్‌ బాధితుడికి హీరో వెంకటేష్ పరామర్శ..

క్యాన్సర్‌ బాధితుడికి హీరో వెంకటేష్ పరామర్శ..

లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని పరామర్శించారు సినీ హీరో దగ్గుబాటు వెంకటేష్... వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ శైలాజపురి కాలనీలో నివాసం ఉండే సురేష్‌.. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం అతను మంచానికే పరిమితమయ్యాడు. విక్టరీ వెంకటేష్‌కి వీరాభిమాని అయిన సురేష్‌కు.. ఆయన అంటే చాలా ఇష్టం.. వెంకటేష్‌ది ఏ సినిమా రిలీజైనా... టీవీల్లో వచ్చినా వదిలేవాడు కాదు. అయితే మంచానికి పరిమితమైన తన అభిమాని గురించి తెలుసుకున్న వెంకటేష్‌.. ఇవాళ మన్సురాబాద్‌లోని సురేష్ ఇంటికి వెళ్లారు. సురేష్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భయపడొద్దు.. ఏం కాదని భరోసా ఇచ్చారు. ఇక తాను అభిమానించే హీరోనే స్వయంగా తన ఇంటికి వచ్చి, ధైర్యం చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు సురేష్. కాగా, సురేష్ స్వస్థలం నల్లగొండ జిల్లా రాజపేట మండలం... ప్రస్తుతం హైదరాబాద్‌లోని మన్సురాబాద్‌లో ఆయన కుటుంబం నివాసం ఉంటుంది.