యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ గాయపడ్డ విశాల్

యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ గాయపడ్డ విశాల్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. సుందర్ సి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతున్నది.  టర్కీలో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా.. బైక్ యాక్సిడెంట్ అయ్యింది.  ఈ యాక్సిడెంట్ లో విశాల్ కాలికి చేతికి గాయాలయ్యాయి.  

యాక్సిడెంట్ జరిగిన వెంటనే విశాల్ ను హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు.  ఎడమకాలు, చేతికి బ్యాండేజ్ వేశారు.  కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్టు సమాచారం.