మోసానికి పాల్పడ్డ సినీ హీరోపై కేసు నమోదు

మోసానికి పాల్పడ్డ సినీ హీరోపై కేసు నమోదు

టాలీవుడ్ యువ హీరోపై కేసు నమోదైయింది. కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డ సినీ హీరో విస్వంత్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో సెకండ్ హీరోగా విస్వంత్ నటించారు. ఈమధ్య కాలంలో వచ్చిన 'ఓ పిట్టకథ'లోను విస్వంత్ నటించాడు. కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డ సినీ హీరో విస్వంత్ పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. విస్వంత్ నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.