పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చిన హీరో Xtreme 200S

పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చిన హీరో Xtreme 200S

దిగ్గజ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన Xtreme 200R బైక్ కొత్త పుల్లీ ఫెయిర్డ్ వర్షన్ ని లాంచ్ చేసింది. కంపెనీ ఈ కొత్త బైక్ కి Xtreme 200S అని పేరు పెట్టింది. దీని ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ.98,500. Xtreme 200R (రూ.90,900)తో పోలిస్తే దీని ధర కేవలం రూ.7,600 మాత్రమే ఎక్కువ. రైడర్ పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేలా 200S డిజైన్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. చూసేందుకు స్పోర్టీ లుక్ లో ఉన్నప్పటికీ ఇది స్పోర్టీ మోటార్ సైకిల్ కాదు.

Xtreme 200Sలో 199.6సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. దీని గరిష్ఠ పవర్ 18.4హెచ్ పిపై 8,000ఆర్పీఎమ్, మాగ్జిమం పీక్ టార్క్ 17.1ఎన్ఎంపై 6,500ఆర్పీఎం. బైక్ ఇంజన్ కి 5 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. ఇది ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజక్షన్ టెక్నాలజీతో వస్తోంది.

ఈ బైక్ కి ముందువైపు 276ఎంఎం డిస్క్ బ్రేక్, వెనకవైపు 220ఎంఎం డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) అమర్చబడింది. హీరో Xtreme 200Rలో మాదిరిగానే ఇది ఉండనుంది. బైక్ ని రెడ్, బ్రౌన్, బ్లాక్ రంగుల వేరియంట్లలో లాంచ్ చేశారు.

బైక్ లో ఫుల్-ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ లైట్ ఇచ్చారు. ఇందులో కంపెనీదే ఎక్స్ ప్లస్ మోడల్ లో ఇచ్చినట్టుగా బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ (స్పీడోమీటర్) అమర్చారు. ఈ క్లస్టర్ లో నేవిగేషన్, గేర్ పొజిషన్, ఫ్యూయల్ తో పాటు అనేక ఇతర డిటెయిల్స్ కనిపిస్తాయి.

హీరో ఎక్స్ ట్రీమ్ 200ఎస్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న 150-200సీసీ సెగ్మెంట్ లోని అనేక బైక్ లతో పోటీ పడనుంది. వీటిలో సుజుకీ జిక్సర్ ఎస్ఎఫ్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వీ3.0 ఉన్నాయి.