డబ్బుల కోసం ఆ పనులు చేయను..

డబ్బుల కోసం ఆ పనులు చేయను..

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవద్దని ప్రయత్నిస్తున్న భామలు చాలా మంది ఉన్నారు. వారిలో లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. ఈ చిన్నది అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వచన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది లావణ్య. అయితే ఆ మధ్య కుర్ర హీరోలతో జత కడుతూనే నాగార్జున లాంటి సీనియర్ హీరో సరసన కూడా నటించింది. ఏ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రాలలో నటిస్తున్న లావణ్య కొద్ది రోజులుగా కరోనా వల్ల ఇంటికే పరిమితమైంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న లావణ్య రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ ను ఆకట్టుకుంటుంది. తాజాగా.. లావణ్య త్రిపాఠి ఓ ఆఫర్‌ కాదన్నదట. తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయమని కొన్ని లిక్కర్‌ కంపెనీలు ఈ భామ ని సంప్రదిస్తే నిర్మొహమాటంగా "నో" చెప్పేసిందట. " వాటికి ప్రచారకర్తగా వ్యవహరిస్తే వాణిజ్య ప్రకటనల కంటే మంచి డబ్బులు అందుతాయి. కానీ ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఈ విషయంలో నా మనసు మారదు" అని లావణ్య త్రిపాఠి స్పష్టం చేసిందట.