ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్తా: అర్చన

ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్తా: అర్చన

సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మాస్టర్వ్రితేజ, బాలాదిత్య, అర్చన ప్రధాన పాత్రల్ని పోషించారు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకుడు. ఎం.ఎన్‌.ఆర్‌ చౌదరి నిర్మించారు. కాగా ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ ఈ నెల 29న విడుదల కానుంది.ఈ సందర్భంగా నటి అర్చన మాట్లాడుతూ..  సమాజంలో పరువు హత్యలను దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావుగారు నా పాత్ర ద్వారా ప్రస్తావించారు. నటనకు ఆస్కారమున్న పాత్ర చేశాను. సినిమాలో ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశా. ప్రేమ మొదలు, పెళ్లి చేసుకోవడం వరకూ అందరిని ఆకట్టుకొనే క్యారెక్టర్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ తెలిపింది.