మహేష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ ఖరారు !

మహేష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ ఖరారు !

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ త్వరలో హీరోగా ఆరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శశి కుమార్ మూతులూరి డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ చిత్రంలో కథానాయిక కోసం వెతుకుతున్న నిర్మాత దిల్ రాజు ఇటీవల 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో మెప్పించిన నాభా నటేష్ అయితే బాగుంటుందని ఆమెను సెలెక్ట్ చేశారట.  డిసెంబర్ నుండి ఈ చిత్రం మొదలుకానుంది.  ఎన్నాళ్ళ నుండో నటుడిగా మారాలనుకుంటున్న అశోక్ అమెరికాలో యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్లో కోర్సులు పూర్తి చేశాడు.