ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ !

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ !

ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో వస్తోన్న ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమాలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏమంత పెద్దగా గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్తినకు అనే పేరు పరిశీలిస్తోంది చిత్రబృందం. ఇక ఈ సినిమాలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ హీరోయిన్ కీర్తిసురేష్‌ని ఎన్టీఆర్ సరసన నటింపజేసేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వచ్చే లోపు.. హీరోయిన్ ఇతరత్రా విషయాలన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చే క్రమంలో.. త్వరలోనే కీర్తిని త్రివిక్రమ్ సంప్రదించనున్నాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.