ఐదు నెలలు నిద్రలేని రాత్రులు గడిపా...

ఐదు నెలలు నిద్రలేని రాత్రులు గడిపా...

ఈ నెల 9వ తేదీన 'మహానటి' చిత్రం విడుదలకానున్న సంగతి విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా మహానటి సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్ ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ముఖాముఖిలోకి వెళ్దాం.  

యాంకర్ : మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా సినిమా రాబోతుంది. ఈ తరం ఆ మహానటిని చూడలేదు. కానీ ఈ మహానటిని చూశాక అచ్చగుద్దినట్లు సావిత్రి ఇలాగే ఉంటుందేమో అనిపించేంతలా ఆ పాత్రకు ప్రాణం పోశారు కీర్తి సురేశ్. ఆమెతో ముఖాముఖిలో సరికొత్త విషయాలు ఏం చెప్పారో తెలుసుకుందాం.

యాంకర్: హాయ్ కీర్తి సురేశ్ గారు. మీరు నడిచే స్టైల్, మీ ఎక్స్ ప్రెషన్స్ ఇంకా అంతా సావిత్రిలానే ఉన్నాయి. ఇంకా ఆ పాత్రలో నుండి బయటకు రాలేకపోతున్నారా? కీర్తి సురేశ్ :  హా నిజమే... ఇంకా మీరు చెప్తుంటే నాకూ అలాగే అనిపిస్తుంది. అనుకోకండా అలా ఆ పాత్రలోకే జారుకోవడం కాదు అలవాటుగా అలా వచ్చేస్తున్నట్టుంది. 
యాంకర్ : నటులకు చాలా తక్కువ పాత్రలు నిలిచిపోయాలా అవుతాయి. వాటిల్లో ఇది చాలా ప్రముఖమైందని భావిస్తున్నారా? 
కీర్తి సురేశ్: నిజమే ఇది ఒకరకమైన నైస్ కైండ్ ఆఫ్ అనుభవంతో కూడిన సినిమా. చాలా మధురమైనది. ఈ సినిమా ఒక గొప్ప జర్నీ. నేను ఈ జర్నీ నుంచి బయటపడలేకపోతున్నా. ట్రావెల్, వొకేషన్ అద్భుతంగా అనిపించింది ఈ మహానటిలో జర్నీ. 
యాంకర్ : మీరు  లెజండరీ యాక్ట్రెస్ అయిన మహానటి పాత్రను చేయాలన్నప్పుడు నో చెప్పారంట.. అలాగే ప్రేక్షకులు కూడా ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత మీకు ఎలా అనిపించింది సావిత్రి పాత్రధారణ సమయంలో.?
కీర్తి సురేశ్ : నాగి నేను మహానటిలో నటించాలన్నప్పుడు నేను నో చెప్పాను. ఆ తర్వాత నాగితోపాటు నిర్మాతలు నన్ను మెంటల్ గా ఓ నెలపాటు బ్రెయిన్ వాష్ చేశారు. కానీ ఏదో ఒకరకమైన శక్తి, నమ్మకం నన్ను ఈ ప్రాజెక్టు ఒప్పుకొనేలా చేసింది. షూటింగ్ ఎంత చేస్తున్నా... టీజర్, సాంగ్స్, పిక్చర్స్ రిలీజ్ అవుతున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ ను చూసి ఆనందం వేసింది. అలా వచ్చినప్పుడు ఇంకా మంచి ఎఫర్ట్ పెట్టగలిగాను.  
యాంకర్ : రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంది? టెన్షన్ ఉందా టెన్షన్ రిలీజ్ అయిందా? 
కీర్తి సురేశ్ : ఎలా పోతుంది.. టెన్షన్ బాగా ఉంది. ఇప్పుడు ఒకరకమైన టెన్షన్ ఉంది. సినిమాపైనా.. పాత్రపైనా ఆడియన్స్ భారీ అంచనాలు ఇప్పటికే పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినట్లుగా సినిమా వస్తుందా... వచ్చింది ఆడియన్స్ కు నచ్చుతుందా అనే టెన్షన్. ఎక్సైట్ గా ఉంది..కానీ ఎలా రెస్పాన్స్ వస్తుందోనన్న టెన్షన్ అంతకన్నా ఉంది. 
యాంకర్ : ఈ ప్రాజెక్ట్ సైన్ చేసిన తర్వాత కీర్తి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు? 
కీర్తి సురేశ్ : ఆహా మంచి క్వచ్చన్ అడిగారు. మొత్తం 10 నెలలు షూట్ చేస్తే దాదాపు 5నెలలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అయితే మధ్యలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నా మహానటికే ఎక్కువ పగలు, రాత్రుల షూటింగ్స్ చేశాను. మహానటి షూట్ ఫినిష్ చేసుకొని మరో ప్రాజెక్టు షూట్ కి వెళ్లనప్పుడు మేకప్, ఐస్, లిప్స్ కు సంబంధించినవన్నీ అనుకోకుండానే.. తెలియకుండానే మహానటిలా వచ్చేస్తున్నాయి. అప్పుడు నేను రియలైజ్ అయి సరిచేసుకోవాల్సి వచ్చేది. 
యాంకర్ : సావిత్రిలా కనిపించడానికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు? 
కీర్తి సురేశ్: కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్ ఇవన్నీ అచ్చం మహానటిలా నన్ను తీర్చిదిద్దిన సూత్రధారులు గొప్ప హార్డ్ వర్క్ చేశారు.  వాళ్లు డే అండ్ నైట్ వర్క్ చేశారు.  నేను సినిమాలు చూస్తుంటే.. వాళ్లు సినిమాలు చూసేవారు. మొత్తం 120 రకాల కాస్ట్యూమ్స్ వాడారు.  ఎన్నో రకాల చీరలు వాడారు. సెట్ ఆర్ట్, లైటింగ్ అన్నీ అందరూ కలిసి ఎంతో కష్టపడితేనే... ఇంత బాగా వచ్చింది. ఇంకా టీనేజ్ పోర్షన్, తర్వాత యాక్ట్రెస్. మాయాబజార్ లో కొన్ని సీన్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ మహానటి గురించి ఎక్కువ సినిమాలు చూడటం, తెలుసుకొనే కొద్ది నేను చేయలేనేమోనన్న భయం కూడా కలిగేది. ఇంకా ఆమె ఎలా అంత గొప్పనటి అయింది. పర్సనల్ లైఫ్ అనేది అంతా తెలుసుకోవాల్సి వచ్చింది. ఆ నటి బిహైండ్ ద స్క్రీన్ ఏంటో అన్నీ తెలుసుకోవాల్సి వచ్చింది. 
యాంకర్: మాకు, ప్రేక్షకులకు మహానటి గురించి కొంతే తెలుసు. కానీ ప్రత్యేకంగా మీకు ఇప్పుడు ఆమె గురించి అంతా తెలుసు. మొత్తం ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ప్రత్యేకంగా ఆమె గురించి? 
కీర్తి సురేశ్ : మహానటి అద్భుతమైన నటి. ఆమె లైఫ్ ను మొత్తాన్ని చూస్తే సుఖాలు, విషాదాలు అన్నీ చేసేప్పుడు పాత్రను బట్టి ఆమె జీవితం అదో ఎమోషనల్ బంధం.. అలా జరిగిపోయాయేమో అనిపిస్తుంటుంది. కానీ.. ఈ సినిమాలోకి ప్రవేశించడం ఈజీ కాదు... అందులోంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలియజేస్తుంది ఈ చిత్రం. 
యాంకర్: విషాద సన్నివేశాల్లో మీరు అస్సలు గ్లిజరిన్ కూడా వాడకుండా ఏడ్చేశారంటున్నారు నిజమేనా..?
కీర్తి సురేశ్ : నేను ఆ పాత్రలో చాలా కనెక్ట్ అయిపోయాను. అలా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆమె లైఫ్ అనుకున్నప్పుడు ఏడుపు వస్తుంటుంది. 
యాంకర్ : మీకు మొత్తానికి ఆమె భాష, శైలి అంతా పర్ఫెక్ట్ అయ్యారా.. అంత క్లారిటీగా ఆమె పాత సినిమాల్లో నటనను పండించాలంటే ?
కీర్తి సురేశ్ : అది మీరే చెప్పాలి. ఎందుకంటే.. అంతా చాలా క్లారిటీగానే వచ్చింది. 11 రోజులపాటు డబ్ చేశాను. లాంగ్వేజ్, డిక్షన్ అంతా ఓకే బాగా చేశాను.  
యాంకర్ : మీరు సావిత్ర పాత్రకు ఒదిగిపోయారని చాలా మంది అన్నారు. కానీ మీకు బాగా హార్ట్ ను టచ్ చేసిన కాంప్లిమెంట్ ఏంటి? 
కీర్తి సురేశ్ : సావిత్రిగారి కూతురు విజయాగారు నన్ను కదిలించేలా అభినందించారు.  మీరేగానీ మాఅమ్మరూపంలో వచ్చి ఉన్నట్లయింతే మీ వెంటే వస్తాను కూతుగా అన్నారు. అది నన్ను బాగా ఎమోషనల్ గా టచ్ చేసింది. అందరూ చూడదగిన సినిమాగా... శాశ్వతంగా గుర్తుండిపోతుంది. 
యాంకర్ : మే 9వ తేదీన వెండితెరను ఏలిన సావిత్రగారి వెండితెరమీద చూడబోతున్నాం. ఇంకా ప్రత్యక్షంగా కీర్తి సురేశ్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే కింది వీడియోను క్లిక్ చేయండి.