పరీక్షకు హాజరైన రౌడీ బేబీ..!

  పరీక్షకు హాజరైన రౌడీ బేబీ..!

సినిమాలపై ఆసక్తి ఉన్నవారు చదువులో రాణించడం కష్టమే. ఇంటర్వ్యూ లలో సినిమావాళ్లను చదువు గురించి ప్రశ్నించినప్పుడు ముందు నుండి సినిమాలపైనే ఆసక్తి అని చదువులపై పెద్దగా ద్రుష్టి పెట్టలేదని చెబుతుంటారు. అయితే రౌడీ బేబీ సాయిపల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఓ వైపు చదువులను కొనసాగిస్తూ.. మరోవైపు సినిమాల్లో రాణిస్తోంది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన రౌడీ బేబీ తాజాగా వైద్య విద్యకు సంబందించిన ఓ పరీక్షకు హాజరైంది. విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసే విద్యార్థులు భారత్‌లో మెడికల్ బోర్డు నిర్వహించే పరీక్షను తప్పకుండా పాస్ కావాల్సి ఉంటుంది. దాంతో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయిపల్లవి నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( FMGE) పరీక్షకు హాజరయ్యారు. తిరుచిలోని MAM కాలేజీలో ఆమె పరీక్ష రాశారు. దాంతో అభిమానులు పెద్ద ఎత్తున సాయిపల్లవి తో సెల్ఫీలు దిగారు.