ఏజెన్సీలో మావోయిస్టు అగ్రనేతలు.. హై అలర్ట్..

ఏజెన్సీలో మావోయిస్టు అగ్రనేతలు.. హై అలర్ట్..

ఏవోబీలో మరోసారి మావోయిస్టులు అలజడి సృష్టించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా శనివారం ఆంధ్ర-ఒడిశా సరహద్దుల్లో మందుపాతర పేల్చారు. ఈ ఘనటలో ముగ్గురు జవాన్లు గాయాలపాలయ్యారు. మరోవైపు ఏవోబీ ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్ ఉన్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు... ఏవోబీలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు ఆంధ్ర పోలీసులతో పాటు.. అటు ఒడిశా పోలీసులు కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.