చంద్రగిరిలో ఉద్రిక్తత, చెవిరెడ్డి అరెస్ట్

చంద్రగిరిలో ఉద్రిక్తత, చెవిరెడ్డి అరెస్ట్

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని రీపోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్‌ఆర్‌ కమ్మరపల్లికి వెళ్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అడ్డగింతతో వేరే మార్గంలో ఎన్‌ఆర్‌ కమ్మరపల్లికి చేరుకున్నారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దళితులపై టీడీపీ చేసిన ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ దళితులను పరామర్శించడానికి వచ్చిన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్‌ చేశారు.