ఎంట్రీ సీన్స్ కోసం రూ.60 కోట్లు ఖర్చు..!!?

ఎంట్రీ సీన్స్ కోసం రూ.60 కోట్లు ఖర్చు..!!?

రాజమౌళి సినిమాల్లో భారీతనం ఉంటుంది.  సినిమాను ఎంత రిచ్ గా తీస్తాడో.. హీరోల ఎంట్రీ ని కూడా అంటే థ్రిల్లింగ్ గా చూపిస్తుంటారు.  హీరో ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఈ మూడు చాలా రిచ్ గా ఉంటాయి.  అందుకే రాజమౌళి సినిమాలు హిట్ అవుతున్నాయి.  

ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ప్రస్తుతానికి కాస్త రెస్ట్ ఇచ్చారు.  ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంట్రీ సీన్స్ హైలైట్ గా ఉంటాయట.  వీరి ఎంట్రీ సీన్స్ కోసం ఏకంగా రూ. 45 కోట్లు ఖర్చు చేసినట్టు వినికిడి.  ఇందులో వీరితో పాటు అజయ్ దేవగణ్ కూడా ఉన్నాడు.  అజయ్ పాత్ర నిడివి తక్కువే అయ్యినా.. బాలీవుడ్ లో స్టార్ హీరో కాబట్టి ఈ స్టార్ ఎంట్రీ సీన్స్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది.  ఎంట్రీ సన్నివేశాలకే ఈ స్థాయిలో ఖర్చు చేస్తే.. మరి సినిమా కోసం ఇంకెంత ఖర్చు పెడతారో..