ఎర్రమంజిల్‌, సచివాలయం కూల్చొద్దు..!

ఎర్రమంజిల్‌, సచివాలయం కూల్చొద్దు..!

ప్రస్తుత సచివాలయం, ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చొద్దని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు... తెలంగాణలో సెక్రటేరియట్, అసెంబ్లీ నిర్మానాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు... కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి తెలంగాణ సర్కార్ 15 రోజుల గడువు కోరడంతో... కౌంటర్‌ దాఖలు చేసేవరకు సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని స్పష్టం చేసింది హైకోర్టు. దీనిపై వెంటనే స్పందించిన అడ్వకేట్ జనరల్... ఇవాళ మధ్యాహ్నమే కౌంటర్‌ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పడంతో.. విచారణను ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.