ప్రభుత్వం దివాళా తీసిందా..ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు...!

ప్రభుత్వం దివాళా తీసిందా..ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు...!

ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపీ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం దివాళా తీసిందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రజలు ధనవంతులు మాదిరిగా ప్రభుత్వం పేదరికంగా అల్లాడుతున్నట్లుందని విచారణ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ అమల్లో ఉంటే ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని హైకోర్టు నిలదీసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి ఆక్షన్ జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో ఈ మేరకు తదుపరి విచారణను మే 28వ తేదీకి వాయిదా వేసింది.