అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటీషన్ కొట్టివేత

అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటీషన్ కొట్టివేత

తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో కన్పించడం లేదని చెప్పింది. రాజకీయ పలుకుబడి కోసమే పిటిషన్‌ వేశారని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగ అంశాలకు సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి ఇంకా 9 నెలల సమయం ఉండగానే.. శాసనసభను రద్దు చేశారని, దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్‌లో భాస్కర్ తెలిపారు.