కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదు

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదు

మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు హైకోర్టు సూచించింది. అయితే పరిహారంలో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని న్యాయస్థానం సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 కేసులను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించింది. పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.