జంప్ జిలానీలకు హైకోర్టు షాక్..!

జంప్ జిలానీలకు హైకోర్టు షాక్..!

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది... టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా ఈ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే... వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. కాగా, పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది జంధ్యాల రవి శంకర్... మరోవైపు అత్యవసర విచారణ అవసరం లేదని వాదించారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు.. దీంతో అత్యవ విచారణ లేదని అభిప్రాయపడ్డ కోర్టు.. తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది.