రాజధాని పిటిషన్లపై విచారణ 27కి వాయిదా

రాజధాని పిటిషన్లపై విచారణ 27కి వాయిదా

రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని తరలింపుపై స్టేటస్ కోను ఈ నెల 27 వరకు పొడిగించింది. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ముగియడంతో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. ఏపీ పరిపాలనా వికేంద్రకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులుపై గవర్నర్ జారీ చేసిన గెజిట్‌పై ఏపీ హైకోర్టు స్టేటస్కో ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అంశంపై అమరావతి జేఏసీతో పాటూ పలువురు పిటిషన్లు దాఖలు చేయగా విచారణ జరిపింది. స్టేటస్కో ఇచ్చి రిప్లై ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. మళ్లీ ఇప్పుడు పొడిగించింది.