ఎర్రమంజిల్ భావనాన్ని ఎలా కూలుస్తారు:హైకోర్టు

ఎర్రమంజిల్ భావనాన్ని ఎలా కూలుస్తారు:హైకోర్టు

సచివాలయం, ఎర్రమంజిల్‌లో పురాతన భవనం కూల్చివేతల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది.  ఈ విచారణలో ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు తమ వాదనలను వినిపించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చట్టబద్దంగానే కూల్చివేతల నిర్ణయం తీసుకుంది. నిపుణుల సిఫారసు మేరకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదని కోర్టుకు తెలిపారు. 

విచారణలో ఏ ప్రాతిపదికత ఆధారంగా పురాతన భవనాలను తొలగించారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరపు న్యాయవాది ఎర్రమంజిల్‌ పురాతన భవనం కాదని, హెరిటేజ్‌ జాబితాలో ఎర్రమంజిల్‌ భవనం లేదని వివరణ ఇచ్చారు.  అంతేకాదు చారిత్రక కట్టడాల కూల్చివేతపై కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు.  ఈ క్రమంలో కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.