రవి ప్రకాష్‌కు హైకోర్టులో ఊరట

రవి ప్రకాష్‌కు హైకోర్టులో ఊరట

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లపై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు రవిప్రకాష్‌.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రవిప్రకాష్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి ఒకసారి సైబర్‌క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలని.. దేశం విడిచి వెళ్లొద్దని రవిప్రకాష్‌కు షరతులు పెట్టింది హైకోర్టు.