మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టడం లేదంటూ స్వయంగా రాష్ట్ర ఎన్నికల సంఘమే హైకోర్టును ఆశ్రయించింది. తమకు 5నెలల గడువు కావాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ రోజు నుంచి 119 రోజుల లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియంతా పూర్తి చేశాక నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది.