జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... రిజర్వేషన్ల వ్యవహారంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది. పంచాయతీ రాజ్ యాక్ట్ 285 ఏ సెక్షన్ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం 50 శాతంలోబడే రిజర్వేషన్లు ఉండాలని చెబుతోందని గుర్తుచేసిన హైకోర్టు... ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఎన్నికల సంఘానికి, తెలంగాణ బీసీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇక రిజర్వేషన్ల వ్యవహారంలో మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సింది తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది.