ఎక్స్‌అఫిషియో ఓటింగ్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ఎక్స్‌అఫిషియో ఓటింగ్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ఎక్స్‌అఫిషియో ఓటింగ్ పిటీషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో ఓట్లను అనుమతించొద్దని కోర్టుకు తెలిపారు  పిటీషనర్ తరఫు న్యాయవాది సత్యంరెడ్డి. Ghmc తీసుకొచ్చిన 90(1) సెక్షన్‌ను చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టివేయాలని కోర్టును కోరారు సత్యం రెడ్డి. దీని వలన ఎక్కువ కార్పొరేటర్ సీట్లు గెలిచినప్పటికి ఎక్స్‌అఫిషియో ఓట్ల వలన మేయర్ ను ఎన్నుకోలేక పోతున్నారన్నారని సత్యం రెడ్డి కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఉన్న 150 వార్డుల్లో 55 మంది ఎక్స్‌అఫిషియో ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు సత్యం రెడ్డి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్‌అఫిషియో ఓటింగ్‌ కల్పించడం ద్వారా స్థానిక ప్రజల ఉద్దేశం నీరుగారిపోతుందన్న సత్యం రెడ్డి.. గతంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినప్పటికీ ఎందుకు కౌంటర్ వేయలేదని పేర్కొంది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరిన ప్రభుత్వం... పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.