ఇంటర్‌ రీవెరిఫికేషన్ ఫలితాలు ఎప్పుడంటే..

ఇంటర్‌ రీవెరిఫికేషన్ ఫలితాలు ఎప్పుడంటే..

ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఈనెల 27వ తేదీన విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు విచారించింది. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ పూర్తి చేశామని ఇంటర్‌ బోర్డు.. కోర్టుకు తెలిపింది. ఫలితాలను 16వ తేదీన విడుదల చేయనున్నామని చెప్పింది. సమాధాన పత్రాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని కోర్టు సూచించింది. ఫలితాలు, సమాధాన పత్రాలను ఒకేసారి ప్రకటించాలని ఆదేశించింది. ఈక్రమంలో మే 27న ఫలితాలు ప్రకటించి, సమాధాన పత్రాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచిస్తూ తదుపరి విచారణను జూన్ 6 కు వాయిదా వేసింది. గ్లోబరీనా సంస్థకు నోటీసులు జారీ చేసింది.