తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు 

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు 

గుడ్లు పెట్టని, వినియోగానికి పనికిరాని మాంసాం ఉండే కోళ్లను చంపే పద్దతులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫౌల్ట్రీ యజమానులు వినియోగానికి ఉపయోగపడని కోళ్లను అక్రమంగా చంపుతున్నారు. ఈ నేపథ్యంలో పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ అనిమల్స్ (పెటా) కోర్టులో పిల్ వేసింది. వినియోగానికి ఉపయోగపడని కోళ్లను చంపే పద్దతి దారుణంగా ఉంటుందని పిటిషన్ లో పేర్కొంది. అలాంటి కోళ్లను అక్రమంగా చంపటం నిలిపివేయాలని కోరింది. ఫౌల్ట్రీ పరిశ్రమ కొన్ని రకాల కోడి పుంజులను ఉపయోగపడని వాటిగా భావిస్తోంది. కారణం అవి గుడ్లు పెట్టవు, వాటి మాంసం కూడా ఉపయోగపడదు. ఈ నేపథ్యంలో ఫౌల్ట్రీ పరిశ్రమలు వాటిని పూడ్చిపెట్టడం,కాల్చివేయటం, నలిపివేయటం లాంటివి చేస్తోందు.  దీనిపై స్పందించిన పెటా వాటిని చంపే విధానంపై హై కోర్టులో పిటిషన్ వేసింది. స్పందించిన హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది.