ఆర్టీసీ సమ్మె: రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక ఆదేశం

ఆర్టీసీ సమ్మె: రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక ఆదేశం

రూట్ల ప్రైవేటీకరణపై సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తెలంగాణ క్యాబినెట్ 5,100 ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ క్యాబినెట్ ప్రొసీడింగ్స్‌ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ కార్పొరేషన్‌ను కూడా కౌంటర్ దాఖలు చేయమని సూచించింది.