స్పీకర్, ఈసీ, ఎమ్మెల్యేలకు నోటీసులు..

స్పీకర్, ఈసీ, ఎమ్మెల్యేలకు నోటీసులు..

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ వాదనలు విన్న తర్వాతే టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనంపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... స్పీకర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుపరి విచారణ నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌తో పాటు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, సురేందర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.