సీఎల్పీ విలీనంపై విచారణ వాయిదా..

సీఎల్పీ విలీనంపై విచారణ వాయిదా..

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని (సీఎల్పీ).. తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభాపక్షం (టీఆర్ఎస్ఎల్పీ)లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది హైకోర్టు. సీఎల్పీ విలీనాన్ని సవాల్ చేస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్, సీఎల్పీ వీలనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు కలిపి రేపు విచారిస్తామని తెలిపింది హైకోర్టు.