టీటీడీ వివాదం: స్వామి పిటిషన్‌పై విచారణ వాయిదా

టీటీడీ వివాదం: స్వామి పిటిషన్‌పై విచారణ వాయిదా

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాణ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చి టీటీడీకి స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌పై విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు... టీటీడీపై ఏపీ సర్కార్ ఆజామాయీషీ ఉండకూడదని గతంలో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్యస్వామి... టీటీడీ ఒక స్వయం ప్రతిపత్తి విధానం కలిగి ఉండేలా ఉమ్మడి ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అజమాయిషీ నుంచి టీటీడీని తప్పించాలని, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇవాళ మరోసారి పిటిషన్ ను విచారించింది ధర్మాసనం. ఇదే సమయంలో పిటిషనర్ కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని మరి కొంత సమయం కావాలని కోరారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. దీంతో విచారణను నవంబర్19వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.