ఇంటర్ బోర్డుపై హైకోర్టు సీరియస్..

ఇంటర్ బోర్డుపై హైకోర్టు సీరియస్..

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు వ్యవహార శైలిపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది... ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, బోర్డు వ్యవహారంపై దాఖలైన విచారణ చేపట్టింది హైకోర్టు. ఇంటర్ రీ వేరిఫికేషన్ , రీ కౌంటింగ్ ఫలితాల రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించింది ఇంటర్ బోర్డు. అయితే, రీ కౌంటింగ్ , రీ వేరిఫికేషన్ పై ఇంకా 8 వేల మంది విద్యార్థులవి ప్రాసెస్ లో ఉన్నాయి అని హైకోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది... ఇంటర్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ఆత్మహత్య చేసుకున్న 26 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. మరోవైపు రీ వేరిఫికేషన్, రీ వ్యాల్యూషన్ లో మరోసారి ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వహించిందని కోర్ట్ కు తెలిపారు పిటిషనర్ తరుపు న్యాయవాది.. దీంతో కేసును సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు... తెలంగాణ ప్రభుత్వం, పిటిషన్ మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.