పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది... బీసీలకు ఏ ప్రాతిపదికన 34 శాతం రిజర్వేషన్లు కేటాయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. 2, 3 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సిద్ధమని హైకోర్టుకు తెలిపారు అడిషనర్ అడ్వొకేట్ జనరల్... బీసీ, ఏ, బీ, సీ, డీ రిజర్వేషన్ల ప్రక్రియలు తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది హైకోర్టు. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల పదవీకాలం ముగిసిందని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్  ప్రకారం బీసీ గణాంకాలు తేల్చకుండా ఎన్నికలు నిర్వహించవద్దని  హైకోర్టు పిటిషన్ దాఖలు కాగా... పిటిషన్ ను విచారించిన హైకోర్టు... తెలంగాణ బీసీ కమిషన్ సర్వే రిపోర్ట్ చేయకుండా ఫైనాన్స్ కమిషన్ బీసీ రిపోర్ట్ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. తెలంగాణ గ్రామ పంచాయితీ రాజ్ యాక్ట్ లో బీసీ జనాభా 34 శాతం ఉంటే... శాసన సభ బిల్లులో 37 శాతం పెట్టారు... ఇక సకల జనుల సర్వేలో 54 శాతం పెట్టారు. ఈ మూడింటిలో ఏది నిజమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. బిసి కమిషన్ తో 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రకారం బీసీల సమగ్ర జాబిత చూపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ జాబితాలను పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.