ఆ 25 పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేయండి-హైకోర్టు

ఆ 25 పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేయండి-హైకోర్టు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో ఈ నెల 30వ తేదీన జరుగనున్న పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలంటూ స్టే విధించింది హైకోర్టు. మండలంలోని 25 గ్రామపంచాయతీలను ఎన్నికల అధికారులు ఎస్టీలకు రిజర్వ్ చేసి ఎన్నికల నిర్వాహణకు సిద్ధమయ్యారు. అయితే, దీనిపై హైకోర్టును ఆశ్రయించారు గిరిజనేతరులు... ఎన్నికలను నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు... విచారణ జరిపిన హైకోర్టు... ఎన్నికలు నిలిపివేయాలంటూ స్టే ఇచ్చింది.