మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతున్న హనీ ట్రాప్ 

మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతున్న హనీ ట్రాప్ 

మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్‌ బాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు. ఇండోర్‌ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న హార్భజన్ సింగ్‌ తనను ఓ అమ్మాయి బ్లాక్‌మెయిల్‌ చేస్తోందంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోనికా అనే 18ఏళ్ల అమ్మాయి.. ఉద్యోగం కోసం ఇంజనీర్‌ను కలిసింది. ఓ అమ్మాయిని ఎరగా వేసి అతన్ని ట్రాప్ చేసింది. ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించింది. మూడు కోట్లు ఇవ్వాలని లేదంటే వీడియోలను లీక్ చేస్తానని బెదిరించింది.

దీంతో అతడు పోలీసులను ఆశ్రయించగా వలపన్ని పట్టుకున్నారు. ఈ హనీ ట్రాప్ లో రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు చిక్కుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బు కూడా కోల్పోయారని చెబుతున్నారు. ట్రాప్ నుంచి బయటకు రాలేక నరకం చూశారు. ఐదుగురు మహిళలు వారిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. చివరికి గ్యాంగ్ ని పోలీసులు అరెస్టు చేయడంతో  హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన ఐదుగురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, బిల్డర్లను టార్గెట్ చేసుకున్నారు. హనీట్రాప్ చేశారు.  వారిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ముఠా బాగోతాన్ని ఇండోర్ పోలీసులు బట్టబయలు చేశారు. హనీట్రాప్  చేసి డబ్బులు గుంజుతున్న మహిళలు, యువకుడిని అరెస్టు చేశారు. అనేక మంది నేతలను హనీ ట్రాప్ చేయడంతో రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ కేసుని దర్యాప్తు చేస్తోంది.