ఏపీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

ఏపీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పోలీసు పరిశీలకుడు కేకే శర్మ అమరావతిలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ఇద్దరు సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు కోసం రాష్ట్రానికి 90 కంపెనీల పారామిలటరీ బలగాలు వినియోగిస్తున్నట్టు కేకే శర్మ తెలిపారు. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రం వద్ద  రాష్ట్ర పోలీసులతో పాటు 300 మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. 36 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సాయుధులైన సీఆర్పీఎఫ్‌ దళాల పహారా కొనసాగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.