తెలంగాణలో భానుడి భగభగ

తెలంగాణలో భానుడి భగభగ

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెల మొదటి నుంచి దంచికొడుతున్న ఎండలు శనివారం తన ప్రతాపాన్ని చూపించింది. శనివారం ఆదిలాబాద్ లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న నాలుగు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని దీంతో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు, ఆపైన నమోదయ్య అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 28 వరకు వడగాల్పుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు.. పశ్చిమ, దక్షిణ తెలంగాణలో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రిలో 46 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 44.7 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలో 44.1 డిగ్రీలు, నల్లగొండ 44 డిగ్రీలు, హైదరాబాద్ లో 43.2 డిగ్రీలు, మెదక్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.