ఫిల్మ్ ఛాంబర్ దగ్గర టెన్షన్ టెన్షన్...

ఫిల్మ్ ఛాంబర్ దగ్గర టెన్షన్ టెన్షన్...
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది... జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉద్వేగంగా వరుస ట్వీట్టు చేసిన గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకుని ఫిల్మ్ ఛాంబర్ చేరుకున్నారు. తనపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపించిన పవన్ కల్యాణ్... ఫిల్మ్ ఛాంబర్‌లో న్యాయవాదులతో సమావేశయ్యారు. తెలుగు ఇండస్ట్రీపై ఇంత జరుగుతున్నా మౌనంగా ఎందుకున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది... తాను ఫిల్మ్ ఛాంబర్‌లోనే ఉంటానని... సినీ ప్రముఖులంతా సమావేశానికి రావాలని పవన్ కల్యాణ్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. నాగబాబు, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్, వరుణ్ తేజ్, శివాజీ రాజా, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, వీవీ వినాయక్... సహా పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ చేరుకోగా... పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పవన్ అభిమానులు ఆయనకు మద్దతుగా... సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు... దీంతో ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.