జనసేన ఆఫీస్ వద్ద టెన్షన్..చుట్టుముట్టిన పోలీసులు !

జనసేన ఆఫీస్ వద్ద టెన్షన్..చుట్టుముట్టిన పోలీసులు !

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం వద్ద ఇద్దరు డీఎస్పీలతో పాటు సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పవన్ అధ్యక్షతన  జనసేన పీఏసీ సమావేశం ప్రారంభమైంది. రాజధానిగా అమరావతిని కొనసాగించడంపై భవిష్యత్‌ కార్యాచరణ మీద ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మూడు రాజధానులకు జనసేన ఎమ్మెల్యే రాపాక మద్దతుపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. పీఏసీ సమావేశం అనంతరం జనసేనాని పవన్‌ రాజధానిలో పర్యటించే అవకాశం ఉంది. అయితే పోలీసుల మోహరింపు కారణంగా ఒకవేళ ఆ పర్యటన రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇక రాత్రి 8 గంటల సమయంలో పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.