బాల్క సుమన్ టూర్‌లో విషాదం..

బాల్క సుమన్ టూర్‌లో విషాదం..

టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రకటించిన తొలి లిస్ట్‌లో చెన్నూరు టికెట్ దక్కించుకున్న ఆ పార్టీ ఎంపీ బాల్క సుమన్... ఈ రోజు ఎన్నికల ప్రచారానాకి శ్రీకారం చుట్టూరు... మంచిర్యాల జిల్లా ఇందారంలో ఆయన పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాల్క సుమన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓదేలు వర్గానికి చెందిన గట్టయ్య కిరోసిన్ పోసుకుని, నిప్పట్టించుకుని ఆత్మహత్యాయత్నం చేయగా... ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు గట్టయ్య పక్కనే ఉన్న మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గట్టయ్యను వరంగల్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించగా... 12 మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. 

గాయాలపాలైనవారి వివరాలు:
1. చేకూరి సత్యనారాయణ రెడ్డి
2. జక్కుల వెంకటేష్, ఇందారం సర్పంచ్‌
3. బొపు అనిష్ బాబు
4. రాజేశ్వరి, రామారావుపేట్‌ ఎంపీటీసీ భార్య
5. సుంకరి విమల
6. మహేందర్ (ఫొటోగ్రాఫర్)
7. నిఖిత, ఇందారం
8. శ్రీనివాస్ (ఫొటోగ్రాఫర్)
9. తోగారి శ్రీనివాస్, ఇందారం
10. భాస్కర్ల శ్రీకాంత్ (టకుమాట్లా)
11. భూక్య నారాయణ నాయక్, శ్రీరాంపూర్ సీఐ, 
12. జైనుద్దీన్, ఇందారం
13. శ్రీనివాస్, ఇందారం ఎంపీటీసీ
14. గట్టయ్య,  జైపూర్
15. జక్కుల గంగమని, ఇందారం
16. చుంచు రాజయ్య, ఇందారం