బతుకమ్మ చీరల పంపిణీలో తోపులాట

బతుకమ్మ చీరల పంపిణీలో తోపులాట

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరనగర్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇరు వర్గాలకు నచ్చజేప్పేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇక్కడ స్థానిక కార్పోరేటర్ భర్త గోవర్థన్ రెడ్డి బీఎస్పీ తరుపున పోటీ చేశారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. టీఆర్ఎస్ కు సంబంధం లేని వారు ఇక్కడికి రావొద్దంటూ నినాదాలు చేశారు.