గుంటూరులో జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత

 గుంటూరులో జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత

గుంటూరులోని భజరంగ్‌ జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీని లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం ఈరోజు యంత్రాలను తీసుకుపోయేందుకు ప్రయత్నించింది. ఈవిషయం తెలుసుకున్న కార్మికులు పెద్దసంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అనంతరం జూట్‌మిల్లు ఎదుట బైఠాయించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి ఉండడంతో అదనపు బలగాలను రప్పించారు.