పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం ప్రాజెక్టు స్పిల్ వే ప్రాంతంలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కింద పడి మృతి చెందాడు. కార్మికుల భద్రతను పట్టించుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ కార్యాలయంఐ కార్మికులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. దీంతో కార్మికులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. నవయుగ సంస్థకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి.