డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై గిరిజనుల దాడి

డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై గిరిజనుల దాడి

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టుల కాల్పులు జరిపి హతమార్చడంతో అరకు, డుంబ్రిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్లపై మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అనుచరులు దాడికి తెగబడ్డారు. ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లకు నిప్పుపెట్టారు. అడ్డొచ్చిన పోలీసులపైనా గిరిజనులు దాడికి దిగారు. మావోయిస్టులు వారోత్సవాలు జరుగుతుంటే పోలీసులు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడితో పోలీసులు భయంతో పరుగులు తీశారు.