కల్వకుర్తి టీఆర్ఎస్ సమావేశం రచ్చ రచ్చ

కల్వకుర్తి టీఆర్ఎస్ సమావేశం రచ్చ రచ్చ

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన టీఆర్‌ఎస్‌ సమావేశంలో వర్గపోరు భగ్గుమంది. కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వచ్చారు. దీంతో జైపాల్ యాదవ్ వర్గం కసిరెడ్డిని అడ్డుకున్నారు. ఆయనపై కార్యకర్తలు కుర్చీలు విసిరారు. కసిరెడ్డిపై కుర్చీలు విసిరేశారు. దీంతో కసిరెడ్డి అనుచరులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల్లో కసిరెడ్డి బీజేపీకి మద్దతివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటా పోటీ నినాదాలతో సమావేశం మధ్యలోనే ముగిసింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు కసిరెడ్డిని అక్కడి నుంచి పంపించివేశారు.