చమురు ధరలో భారీ హెచ్చుతగ్గులు

చమురు ధరలో భారీ హెచ్చుతగ్గులు

ఇరాన్‌ అణు ఒప్పంద నుంచి వైదొలగడంతో పాటు ఆ దేశం ఆంక్షలు విధించాలని అమెరికా నిర్ణయిచడంతో ముడి చమురు ధరలు అమాంతంగా క్షీణించాయి. ఒకదశలో 4.38 శాతం క్షీణించిన యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ఆయిల్‌ తరవాత కోలుకుంది. 2.4 శాతం నష్టంతో 69.06 డాలర్ల వద్ద ముగిసింది. అలాగే బ్రెంట్‌ క్రూడ్‌ (ఆసియా దేశాల మార్కెట్‌) ధర కూడా ఒకదశలో నాలుగు శాతం క్షీణించినా.. క్లోజింగ్‌కల్లా కోలుకుంది. కేవలం 0.6 శాతం క్షీణించి75.51 డాలర్ల వద్ద ముగిసింది. 2015లో ఒబామా హయాంలో అమెరికా- ఇరాన్‌ల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఒపెక్‌ దేశాల్లో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఇరాన్‌ మూడోస్థానంలో ఉంది. ఒకవేళ అమెరికా ఆంక్షలు విధించే పక్షంలో చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశముంది. ఈ కారణంతోనే భారీ క్షీణించిన చమురు ధరలు మళ్ళీ కోలుకున్నాయి.