ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు హైకోర్టులో ఊరట

ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు హైకోర్టులో ఊరట

ఆంధ్రపదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఐటీ గ్రిడ్స్ కేసులో.. ఐటీ గ్రిడ్స్ సంస్థ చీఫ్ అశోక్‌కు హైకోరుట్లో ఊరట లభించింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారంటూ నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత అశోక్‌.. మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అశోక్‌, ఆయన భార్య శ్రీలక్ష్మీ, అనుచరులు షేక్‌ అబ్దుల్‌ ఉజైన్‌, కమలాకర్‌ విడివిడిగా రంగారెడ్డిజిల్లా కోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. అశోక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి ఒకరోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని అశోక్‌ను ఆదేశించింది హైకోర్టు.